24 March, 2026 | 3:03 AM

కోలీవుడ్ ఎంట్రీకి సై!

24-03-2026 01:23 AM

‘దేవకీ నందన వాసుదేవ’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన మాజీ మిస్ యూనివర్స్ ఇండియా మానస వారణాసి. ఇటీవలి బ్లాక్‌బస్టర్ విజయాన్ని నమోదు చేసిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రంతో యువతలో మరింత క్రేజ్ సంపాదించుకుందీ ముద్దుగుమ్మ. ఈ చిత్రంలో అందంతో ఆకర్షించడమే కాక అభినయంతోనూ విమర్శకుల ప్రశంసలు అందుకుందీ అమ్మడు. భారీ విజయంతో ప్రస్తుతం నెటిజన్లు ‘కపుల్ ఫ్రెండ్లీ’ గురించే చర్చించుకుంటున్నారు.

ఇలా మానస వారణాసి పేరు ఇప్పుడు దక్షిణాదిన హాట్ టాపిక్‌గా మారారు. ఇదిలావుంటే ఈ యంగ్ బ్యూటీ గురించి తాజాగా మరో ఆసక్తికర వార్త వినవస్తోంది. మానస కోలీవుడ్‌లో ఒక బంపర్ ఆఫర్ అందుకుందని సమాచారం. ఇటీవల ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ చిత్రంతో మెప్పించిన విలక్షణ నటుడు శశికుమార్ సరసన కథానాయికగా నటించే అవకాశాన్ని మానస దక్కించుకుందట.

ఈ క్రేజీ ప్రాజెక్టును టాలెంటెడ్ డైరెక్టర్ మణికందన్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో శశికుమార్ ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. అటు మాస్ యాక్షన్, ఇటు క్లాస్ ఎమోషన్స్ కలగలిసిన ఈ కథలో మానస పాత్ర చాలా కీలకంగా ఉండబోతోందట. రెండో సినిమాతోనే టాలీవుడ్‌లో తన సత్తా చాటుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు తమిళ పరిశ్రమలోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఒకేసారి స్టార్ హీరో, పెద్ద డైరెక్టర్‌తో కోలీవుడ్ ప్రయాణం మొదలుపెడుతుంటం మానస కెరీర్‌లో ఒక పెద్ద మలుపుగా అభివర్ణిస్తున్నారు క్రిటిక్స్.