వెంకీ చిత్రంలో చాన్స్!
టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేశ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఇప్పటివరకు వచ్చిన సినిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. ‘ఎఫ్2’, ‘ఎఫ్3’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి హిట్ల తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న కొత్త సినిమాపై ఇప్పుడు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని షైన్‌స్క్రీన్స్, సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ‘వెంకీ 5’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను మేకర్స్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు.
ఈ చిత్రంలో నందమూరి కళ్యాణ్‌రామ్ మరో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలకు ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఒక హీరోయిన్‌గా కీర్తి సురేశ్‌ను ఎంపిక పూర్తయింది. ఇప్పటికే కీర్తి ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ఈ విషయమై మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉండగా, ఈ సినిమాలో నటించే మరో హీరోయిన్ ముచ్చట కూడా ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
ఈ సినిమాలో యంగ్ బ్యూటీ కయాదు లోహర్ కూడా ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నట్లు సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. కయాదు ఎంపిక దాదాపు ఖాయమైందని, త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. జూన్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.




