4 April, 2026 | 4:14 AM

మహనీయుల జయంతి వేడుకలకు భారీ ఏర్పాట్లు

04-04-2026 02:25 AM

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ముషీరాబాద్,ఏప్రిల్ 3(విజయక్రాంతి): మహనీయుల జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తుందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం  హైదరాబాద్ బషీర్ బాగ్ చౌరస్తా లోని డాక్టర్ బాబు జగ్జీవన్ రాం విగ్రహం వద్ద జయంతి వేడుకల ఏర్పాట్లను జయంతి ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి మంత్రి అడ్లూరి సందర్శించి  పరిశీలించారు.

ఈ నెల 5న భారత  మాజీ ఉప ప్రధాని  బాబు జగ్జీవన్ రాం, 14న రాజ్యాంగ నిర్మాత బీఆర్.  అంబేద్కర్ జయంతి వేడుకలలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు ఉప ముఖ్య మంత్రి బట్టి విక్రమార్క, మంత్రి వివేక్ వెంకటస్వామి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ లతో పాటు దళిత ప్రజా ప్రతినిధులు పాల్గొననున్నట్లు మంత్రి వివరించారు.

దేశంలో అట్టడుగు వారికి దిశ, నిర్దేశం చేసిన మహనీయుల సేవలను స్మరించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. దళిత సం ఘాల నాయకుల సమన్వయంతో ఉత్సవ కమిటీ వేశామని, ఘనంగా ఈ వేడుకలు నిర్వహించబోతున్నామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవాల కమిటీ కో చైర్మన్లు డి. సుదర్శన్ బాబు, డా. అల్లిబిల్లి మహేందర్, బైరి వెంకటేష్, తాలూకా అనిల్, మేతరి రోజా రాణి, బైండ్ల శ్రీనివాస్, గంట సుదర్శన్, ఇటిక రాజు, జన్ను కనకరాజు, దండు సురేందర్, మాల మహానాడు చెన్నయ్య, మేడి పాప య్య, జి. నాగేష్  తదితరులు పాల్గొన్నారు.