29 August, 2026 | 6:20 PM

ఆర్డీవో కార్యాలయ స్థల పరిశీలన

29-08-2026 05:22 PM

నస్పూర్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా రెవెన్యూ అధికారి (RDO) నూతన కార్యాలయ నిర్మాణానికి మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ మండలం సీసీసీ కస్తూర్బా గాంధీ విద్యాలయం (కేజీబీవీ) పక్కన సర్వే నంబర్ 72లో ఎకరం 10 గుంటల ప్రభుత్వ స్థలాన్ని శనివారం అధికారులు పరిశీలించారు. సెప్టెంబర్ రెండవ తేదీన రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా భవన నిర్మాణానికి భూమిపూజ ఉండనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ స్థలమంతా పిచ్చిమొక్కలతో నిండుకొని ఉండటంతో ఆది వారం నుంచి తొలగింపు పనులు చేపట్టనున్నారు. శనివారం ఈ స్థలాన్ని నస్పూర్ తహసిల్దార్ సంతోష్ కుమార్, కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్ రాజు, హౌసింగ్ శాఖ ప్రాజెక్ట్ ఆఫీసర్ బన్సీ లాల్ లు సందర్శించారు.