15 August, 2026 | 1:52 AM

రేషన్ కార్డులపై ఫొటోలు లేకుండా పంపిణీ చేయాలి

15-08-2026 12:00 AM

లేదంటే ప్రధానమంత్రి ఫొటో కూడా పెట్టాలి

బియ్యం పంపిణీ సొమ్ము ఒకడిది.. సోకొకడిదన్నట్టుంది

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీపై ఎంపీ ఈటల అభ్యంతరం 

సికింద్రాబాద్, ఆగస్టు14 (విజయక్రాంతి): ఒక వైపు నిధులకోసం ఢిల్లీకి పోతున్నారు. తెచ్చుకుంటున్నారు.కానీ కేంద్రం ఇస్తుంది అని మాత్రం బయటికి చెప్పడం లేదు అన్ని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. సిక్ విలేజ్ గాయత్రి గార్డెన్ లో శుక్రవారం మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్,భానుక నర్మదా మల్లికార్జున్, బిజెపి నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద దేశవ్యాప్తంగా బిపిఎల్ కింద ఉన్న ప్రజలకు రేషన్ బియ్యం అందిస్తుంది అన్ని తెలియజేస్తూ మన రాష్ట్రంలో 57 లక్షల రేషన్ కార్డులు. 1 కోటి 91 లక్షల మందికి 9 లక్షల 55 వేల మెట్రిక్ టన్నులు బియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలియజేశారు.

రాష్ట్ర ప్రభుత్వం తరపున 49.4 లక్షల రేషన్ కార్డులకు 1 కోటి 50 లక్షల మందికి 9 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇస్తుంది.రాష్ట్రం కంటే కేంద్రం ఎక్కువ మందికి బియ్యం ఇస్తుంది అని అన్నారు. మోడీ ప్రభుత్వం బియ్యం ఉచితంగా ఇస్తుంటే.. కార్డులు మాత్రం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలు పెట్టి ఇస్తారట. ఇదేం సంస్కారం. మీ తాత జాగీరా ?  అని ప్రశ్నించారు. ధరణి భారతి 22ఏ నిషేధిత భూముల విషయంలో సమగ్ర నివేదిక తయారు చేసి బిజెపి ప్రజా ప్రతినిధులుగా ఉద్యమాలు చేస్తామన్నారు. ఈ సమావేశంలో బానుక మల్లికార్జున్, బి.ఎన్ శ్రీనివాస్, బిజెపి సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.