రసాయనాలతో రసగుల్లా
ఉత్తరప్రదేశ్‌లో వెయ్యి కిలోలు పట్టివేత
1,200 కిలోల కల్తీ జున్ను కూడా
రాఖీ పండుగ అదునుగా అక్రమార్కుల దందా
ఘాజియాబాద్, ఆగస్టు 25: నోరూరించే రసగుల్లాలు పెద్ద ఎత్తున కల్తీ జరిగిందని గుర్తించిన ఘాజియాబాద్ ఫుడ్ సేఫ్టీ అధికారులు మంగళవారం పలు దుకాణాలపై దాడులు నిర్వహించి 1000 కిలోల రసగుల్లా లు, 36వేల కిలోల కల్తీ శనగలు స్వాధీనం చేసుకున్నారు. మధురలోనూ 1200 కిలోల కల్తీ జున్నును స్వాధీనం చేసుకున్నారు. ఇవి తయారు చేస్తున్న గోదాం నిర్వాహకుల లైసెన్సును రద్దుకు చర్యలు చేపట్టినట్లు అధికా రులు తెలిపారు. రాఖీ పండుగ సమీపించనున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ఎఫ్‌ఎస్‌డీఏ (ఆహార భద్రత, ఔషధ శాఖ) అప్రమత్తమైంది.
ఈ నేపథ్యంలో మంగళవారం ఘాజియాబాద్‌లోని కల్తీ జరుగుతున్న సమాచారంతో బిహారీపురా ప్రాంతంలోని ఓ గోదాంలో దాడులు నిర్వహించింది. కల్తీ పన్నీర్, చక్కెర, రసాయాలతో రసగుల్లాలను తయారు చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. అరోరూట్, సఫోలైట్ అనే ప్రమాదకరమైన బ్లీచింగ్ రసాయనాన్ని ఈ పదార్థాల్లో గుర్తించారు. దీనికి తోడు గోదాంలో అపరిశుభ్ర వాతావరనం ఉన్నట్లు గుర్తించారు. కొన్ని శాంపిళ్లను ల్యాబ్‌కు పంపించారు. వెయ్యి కిలోల మిఠాయిలను స్వాధీనం చేసుకున్నామని, లైసెన్సు రద్దుకు చర్యలు తీసుకున్నా మని తెలిపారు.






