19 July, 2026 | 2:42 AM

కామినేనిలో అరుదైన చికిత్స

19-07-2026 12:34 AM

91 ఏళ్ల వృద్ధుడికి కిడ్నీ క్యాన్సర్‌పై రాడికల్ నెఫ్రెక్టమీ 

హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని కామినేని ఆసుపత్రి వైద్యులు 91 ఏళ్ల రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి సుబ్రహ్మణ్యంకు కిడ్నీ క్యాన్సర్‌పై అత్యంత క్లిష్టమైన రాడికల్ నెఫ్రెక్టమీ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. కుడి కిడ్నీలో ఉన్న అగ్రెసివ్ రీనల్ సెల్ కార్సినోమాను అత్యల్ప రక్తస్రావంతో తొలగించారు.

ఈ శస్త్రచికిత్సను డాక్టర్ జి. అవినాష్‌రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, కామినేని హాస్పిటల్స్ నేతృత్వంలోని అనస్థీషియాలజిస్టులు, ఇంటెన్సివిస్టులు, నర్సులు, ఫిజియోథెరపిస్టుల బృందం విజయవంతంగా పూర్తి చేసింది. ప్రస్తుతం రోగి ఆరోగ్యం నిలకడగా ఉండగా, మిగిలిన ఒక కిడ్నీ సాధారణంగా పనిచేస్తోందని వైద్యులు తెలిపారు.

ఈ సందర్భంగా డాక్టర్ జి. అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘క్యాన్సర్ చికిత్సకు వయస్సు అడ్డంకి కాదు. రోగి శారీరక దృఢత్వం, సరైన ప్రణాళిక, మల్టీడిసిప్లినరీ వైద్య విధానం ఉంటే 90 ఏళ్లు పైబడిన వారికీ విజయవంతమైన చికిత్స అందించవచ్చు’ అని పేర్కొన్నారు.