19 July, 2026 | 2:41 AM

ఐఐఎంసీలో ‘దీక్షారంబ్’ విజయవంతం

19-07-2026 12:36 AM

హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి): హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్ (ఐఐఎంసీ అటానమస్) లో 2026 విద్యా సంవత్సరానికి డిగ్రీ ప్రథమ సంవత్సరంలో చేరిన విద్యార్థుల కోసం జూలై 11 నుంచి 18 వరకు ‘దీక్షారంబ్‘ పేరుతో ఏడు రోజుల ఇండక్షన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ప్రారంభ కార్యక్రమంలో ప్రొ. వంగపల్లి విశ్వనాథం, కళాశాల చైర్మన్ విద్యార్థులకు ఉన్నత విద్యలో అనుసరించాల్సిన విలువలను వివరించగా, చల్లా ప్రసన్న, కళాశాల సెక్రటరీ విద్యార్థులకు కళాశాల అందిస్తున్న విద్యా, ప్లేస్మెంట్ అవకాశాల గురించి తెలిపారు. పి. పూర్ణచంద్రరావు, మాజీ ప్రిన్సిపల్, నైపుణ్యాభివృద్ధిపై అవగాహన కల్పించగా, కూర రఘువీర్, కళాశాల ప్రిన్సిపల్, కళాశాల కార్యకలాపాలను పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు ఇ. రామకృష్ణ, సత్యనారాయణ, ఎన్సీసీ ఆఫీసర్ వసంత్, ప్లేస్మెంట్ ఆఫీసర్ దిలీప్, లైబ్రేరియన్ రమాదేవి, ఫిజికల్ డైరెక్టర్ కిషన్ వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. మెడికవర్ హాస్పిటల్ సహకారంతో 400 మందికి పైగా విద్యార్థులకు మెడికల్ క్యాంప్, జి.ఏ. డెంటల్ సహకారంతో 310 మందికి పైగా విద్యార్థులకు డెంటల్ క్యాంప్ నిర్వహించారు. డా.గౌతమ్ విద్యార్థులకు దంత ఆరోగ్యంపై సూచనలు అందించారు. కార్యక్రమంలో డా. సంతోషి, డా. డి. తిరుమలరావు (డీన్లు), స్వప్న (ఐక్యూఏసీ కో-ఆర్డినేటర్) పాల్గొన్నారు.