19 July, 2026 | 4:03 AM

జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం కమిటీ కుర్రోళ్లు

19-07-2026 01:35 AM

72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 2024 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 మధ్య సెన్సార్ పూర్తి చేసుకున్న చిత్రాలను పరిశీలించి, చలనచిత్ర రంగంలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన విజేతలను కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ శనివారం న్యూఢిల్లీలో వెల్లడించింది. ప్రముఖ మలయాళ దర్శకుడు జయరాజ్ నేతృత్వంలోని 11 మంది సభ్యుల జూరీ ఈ అవార్డుల విజేతలను ఎంపిక చేసింది.  మొత్తం 400లకు పైగా సినిమాలు జూరీ ముందుకు రాగా, వాటిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వాటిని ఎంపిక చేశారు. ఈసారి ఉత్తమ నటుడి అవార్డును ఇద్దరు పంచుకున్నారు. ‘చందూ ఛాంపియన్’, ‘భ్రమయుగం’లో నటనకు గానూ కార్తిక్ ఆర్యన్, మమ్ముట్టిలకు ఈ అవార్డు ప్రకటించారు. ఉత్తమ నటి పురస్కారం యామి గౌతమ్ (ఆర్టికల్ 370)ను వరించింది. ఉత్తమ దర్శకుడిగా రాజ్‌కుమార్ పెరియాసామి (అమరన్) ఎంపికయ్యారు. అయితే, ఈ ఏడాది అవార్డుల్లో టాలీవుడ్ తన సత్తా చాటగా, జాతీయ స్థాయిలో పలు ప్రతిష్టాత్మక చిత్రాలు అవార్డులను కొల్లగొట్టాయి. ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కమిటీ కుర్రోళ్లు’ జాతీయ పురస్కారానికి ఎంపికైంది. టాలీవుడ్‌కు మొత్తం తొమ్మిది అవార్డులు దక్కాయి. బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన విజువల్ వండర్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ ఉత్తమ ప్రజాదరణ పొందిన వినోదాత్మక చిత్రంగా జాతీయ అవార్డును దక్కించుకుంది. సున్నితమైన కుటుంబ కథాచిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘35 చిన్న కథ కాదు’ సినిమా ఉత్తమ బాలల చిత్రంగా ఎంపికైంది. అంతేకాక, ఇందులో నటించిన అరుణ్‌దేవ్ పోతులకు ఉత్తమ బాల నటుడిగా అవార్డు లభించింది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన భారీ చిత్రం ‘పుష్ప 2: ది రూల్’ పలు సాంకేతిక విభాగాల్లో అవార్డులను గెలుచుకుంది. ‘కమిటీ కుర్రోళ్లు’, ‘లక్కీ భాస్కర్’ సినిమాలు కూడా ప్రాంతీయ, సాంకేతిక విభాగాల్లో తమ ప్రతిభకు గాను గుర్తింపు పొందాయి. భారతీయ చలనచిత్ర రంగానికి 2024 ఏడాది ఎంతో ప్రత్యేకమైనదని, అటు కమర్షియల్ బ్లాక్‌బస్టర్లు, ఇటు వైవిధ్యమైన కథాంశాలతో కూడిన చిత్రాలు సమతూకంతో అలరించాయని, అవార్డుల ఎంపికలో ఈ వైవిధ్యం స్పష్టంగా కనిపించిందని జూరీ చైర్మన్ జయరాజ్ అవార్డుల ప్రకటన సందర్భంగా పేర్కొన్నారు. విజేతలకు త్వరలోనే న్యూఢిల్లీలో జరిగే ప్రత్యేక వేడుకలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు.

పురస్కారాల వివరాలు (ఫీచర్ ఫిల్మ్స్)

ఉత్తమ చిత్రం: ఆర్టికల్ 370 (హిందీ)

ఉత్తమ నటుడు: కార్తీక్ ఆర్యన్ (చందూ ఛాంపియన్

ఉత్తమ నటుడు: మమ్ముట్టి (భ్రమయుగం

ఉత్తమ నటి: యామి గౌతమ్ (ఆర్టికల్ 370

ఉత్తమ దర్శకుడు: రాజ్‌కుమార్ పెరియసామి (అమరన్‌ేొతమిళం) 

ఉత్తమ సహాయ నటుడు: సంజయ్ మిశ్రా (భక్షక్)

ఉత్తమ సహాయ నటి: మిథ్య (రూపశ్రీ వర్కాడే) 

ఉత్తమ సహాయ నటి: సచన నమిదాస్ (మహారాజ) 

ఉత్తమ వినోదాత్మక చిత్రం: కల్కి 2898 ఏడీ (తెలుగు)

ఉత్తమ బాలల చిత్రం: 35 చిన్న కథ కాదు (తెలుగు)

జాతీయ సమగ్రత/సామాజిక విలువలు పెంపొందించే ఉత్తమ చిత్రం: 

కెప్టెన్ మిల్లర్ (తమిళం)

ఉత్తమ ప్రజాదరణ చిత్రం: కల్కి 2898 ఏడీ 

ఉత్తమ తొలి దర్శకత్వం: రణ్‌దీప్ హుడా (స్వాతంత్య్ర వీర్ సావర్కర్) 

ఉత్తమ యాక్షన్: మహారాజ (తమిళ్)

ఉత్తమ కొరియోగ్రఫీ: విజయ్ గంగూలీ (ఆజ్ కీ రాత్ సాంగ్ 2 చిత్రం) 

ఉత్తమ గేయ రచన: మనోజ్ ముంతాషిర్ (జానేదో పాట మైదాన్ చిత్రం) 

ఉత్తమ సంగీతం (నేపథ్యం): జీవీ ప్రకాశ్ (అమరన్)

ఉత్తమ సంగీతం (పాటలు): శశ్వాంత్ సచ్‌దేవ్ (ఆర్టికల్ 370) 

ఉత్తమ మేకప్: పీ రవికుమార్ (కమిటీ కుర్రోళ్లు)

ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: దీపాలి నూర్, సీతల్ శర్మ (పుష్ప2)

ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్: నితిన్ జిహానీ చౌదరి (కల్కి 2898 ఏడీ)

ఉత్తమ ఎడిటింగ్: ఆర్ కలైవానన్ (అమరన్)

ఉత్తమ సౌండ్ డిజైన్: మానస్ చౌదరి (భూల్ భూలయ్య 3

ఉత్తమ స్క్రీన్‌ప్లే (సంభాషణలు): వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)

ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయిత (అడాప్టెడ్): యోగేశ్ దేశ్‌పాండే (స్వరగంధర్వ సుధీర్ ఫాడ్కే)

ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయిత (ఒరిజినల్): సుకుమార్ (పుష్ప2)

ఉత్తమ సినిమాటోగ్రఫీ: షెహనాద్ జలాల్ (భ్రమయుగం)

ఉత్తమ గాయని: వైకోమ్ విజయలక్ష్మి (ఏఆర్‌ఎం)

ఉత్తమ గాయకుడు: అభయ్ జోథ్ పూర్కర్ (గరాత్ గణపతి)

ఉత్తమ బాల నటులు: రిద్ధిమాన్ బెనర్జీ, తపోమయ్ దేవ్, 

గీతాశ్రీ చక్రవర్తి (ఆంకో కి కితిన్ బెంగాలీ)

ఉత్తమ బాల నటుడు: అరుణ్‌దేవ్ పోతుల (35 కథ కాదు)

ఉత్తమ బాల నటుడు: అతిశ్ శెట్టి 

అవార్డు పొందిన ప్రాంతీయ చిత్రాలు

ఉత్తమ హిందీ చిత్రం: శ్రీకాంత్

ఉత్తమ తెలుగు చిత్రం: కమిటీ కుర్రోళ్లు 

ఉత్తమ తమిళ చిత్రం: రాయన్

ఉత్తమ మలయాళం ఫిల్మ్: ఫెమినిచ్చి ఫాతిమా

ఉత్తమ కన్నడ చిత్రం: మిథ్య

ఉత్తమ మరాఠీ చిత్రం: ముక్కమ్ 

పోస్ట్ బొంబిల్ వాడి

ఉత్తమ తుళు చిత్రం: ఇంబు

ఉత్తమ గర్వాలీ చిత్రం: ధోలి

ఉత్తమ ఒడియా చిత్రం: లహరి: ది టైడ్ ఆఫ్ టైమ్

ఉత్తమ మణిపురి చిత్రం: సునీత

ఉత్తమ కొంకణి చిత్రం: మోగోసమ్

ఉత్తమ గుజరాతీ చిత్రం: మారన్

ఉత్తమ బెంగాలీ చిత్రం: చలిచిత్ర ఎకోన్

ఉత్తమ అస్సామీ చిత్రం: జుయ్‌ఫుల్ 

(ఆరెంజ్ అండ్ పర్పుల్)

నాన్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీ

స్పెషల్ జ్యూరీ: చోలా డోరా ఔర్ సుయ్ 

(హిందీ), భద్రకాళి నాటకం (మలయాళం)

ఉత్తమ స్క్రిప్ట్: ఓబర్ (హిందీ కశ్మీరీ) ఫరాజ్ అలీ

ఉత్తమ వాయిస్ ఓవర్: లిటిల్ ప్లానెట్: ఏ టేల్ ఆఫ్ 

ఫ్రాగ్స్ (ఇంగ్లీష్) సుందరాయ జయచంద్రన్

ఉత్తమ సంగీత దర్శకత్వం: పరాట్ 41డిగ్రీస్ 

ఛాయా మగవీర్: శివ్ పాల్సింగ్ కాంగ్

ఉత్తమ లఘుచిత్రం: హమ్‌సఫర్ (మరాఠీ)

ఉత్తమ యానిమేషన్ చిత్రం: టచ్డ్ ఏజ్ వాటర్

ఉత్తమ సోషల్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ 

వాల్యూస్: పిప్లంత్రి: ఏ టేల్ ఆఫ్ ఎకో ఫెమినిజం

ఉత్తమ డాక్యుమెంటరీ: రామ్‌నామి (హిందీ)

ఉత్తమ ఆర్ట్/కల్చర్: మెయిన్ నిదా (హిందీ)

ఉత్తమ హిస్టారికల్ రీకన్‌స్ట్రక్షన్ కాంపిలేషన్ 

చిత్రం: కకోరి (హిందీ)

స్పెషల్ మెన్షన్ అవార్డులు

మెయ్యజగన్ తమిళ్ (ఫిల్మ్ సౌండ్ మిక్స్ ఇంజినీర్: సురేన్ జీ) కెప్టెన్ మిల్లర్ (తమిళ్): ధనుష్