రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే
నల్లగొండ జిల్లాలో ఆయనే కీలకం
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి): కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఏఐసీసీ ఇచ్చి న మాట ప్రకారం మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చెయ్యడమే తమ లక్ష్యమన్నారు.
రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలంటే తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలవాలని, రాజగోపాల్ రెడ్డి టీమ్‌గా పనిచేస్తే పార్టీకి మేలు జరుగుతుందన్నారు. తుంగతుర్తి రాజకీయ వివాదం అం శంపై మాట్లాడేందుకు గాంధీభవన్‌కు రాజగోపాల్ రెడ్డిని పిలిచిన జగ్గారెడ్డి ఆయనతో శనివారం సమవేశమై చర్చించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తుంగతుర్తి వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోలేదని రాజగోపాల్‌రెడ్డి చెప్పారన్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజగో పాల్ రెడ్డి కీలక నాయకుడన్నారు. తెలంగాణ ఉద్యమంలో రాజగోపాల్‌రెడ్డి పోరాటం చేశారని, రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలకు అండగా నిలిచారని తెలిపారు. భేటీలో రాష్ట్ర రాజకీయాలపైనే మాట్లాడామని, తుంగతుర్తి వివాదం ముగిసిన అంశమన్నారు. రాజ్‌గోపాల్ రెడ్డి మాట్లాడుతూ... రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యమన్నారు. పదవుల కోసం తాను ఎదురు చూడనని, రాహుల్ గాంధీ నిర్ణయమే ఫైనల్ అన్నారు. పంచాయితీలు జగ్గారెడ్డికి అప్పగించడం మంచిదేనన్నారు.






