28 August, 2026 | 6:37 PM

Breaking News

ఆల్లాపూర్ ఎక్స్ రోడ్ లో స్వీట్ హార్ట్ రెస్టారెంట్ గొప్ప ప్రారంభం   •   అన్నా చెల్లెలు అక్క తమ్ముళ్లకు ప్రతీక రక్షాబంధన్   •   దుమ్ము రేపుతున్న రోడ్డు పనులు.. ప్రజల ప్రాణాలతో చెలగాటం!   •   సోదర భావానికి ప్రతీక.. రాఖీ పర్వదినం   •   శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో రాఖీ వేడుకలు   •   పరస్పర మైత్రికి రక్షాబంధన్‌.. సంప్రదాయ పరిరక్షణకు జంధ్యాధారణ   •   రాఖీ వేడుకల్లో ఎమ్మెల్యే వంశీకృష్ణ   •   మాజీ డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డికి రాఖీ కట్టిన సోదరీ అరుణ   •   ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి   •   స్కానింగ్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్   •  

తల, హృదయానికి బహుమతిగా రాఖీ

28-08-2026 05:48 PM

- రాఖీ సందర్భంగా హెల్మెట్లు పంపిణీ చేసిన రాపోలు నవీన్ కుమార్

నేరేడుచర్ల,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా, నేరేడుచర్లలో 10 మంది ద్విచక్ర వాహనదారులకు చిన్న పిల్లలతో గులాబీ పువ్వు ఇచ్చి స్వీట్ తినిపించి రాఖి కట్టి హెల్మెట్ లను బహుమతిగా రాపోలు నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా స్థానిక ఎస్.ఐ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ... భారతదేశంలో ప్రతిరోజూ 400 మందికి పైగా రైడర్లు రోడ్డపై మరణిస్తున్నారని, రోడ్లు భద్రతను ప్రోత్సహించడానికి రాఖి సంప్రదాయాన్ని తిరిగి వ్రాయాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ హెల్మెట్ లేని ప్రయాణం ప్రాణంతో ఆటలాడడమే అని, నా అన్న,నా తమ్ముడు సురక్షితంగా ఉంటేనే రాఖీకి అర్థం ఉంటుందని సాటి చెప్పిన పిల్లలకి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో దూళిపాళ ధనుంజయ నాయుడు, పెరుమాళ్ళ సతీష్ కుమార్,రామ్ సైదులు,తకెళ్ళ నాగార్జున, షేక్ నాగుల్ మీరా, చిలకరాజు శ్రీనివాస, అరె శ్రీకాంత్, రమేష్, నాగరాజు, కర్రీ సతీష్ రెడ్డి,కొప్పు గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.