28 August, 2026 | 8:09 PM

Breaking News

సీఎంకు రాఖీ కట్టిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్   •   విద్యుత్‌ ఉద్యమ అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమిస్తాం   •   ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఉద్యమిద్దాం   •   విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి   •   డ్రై ఫ్రూట్స్‌తో రాఖీలు తయారు చేసిన చిన్నారి   •   ఏఐవైఎఫ్ మానుకోట జిల్లా నూతన కమిటీ ఎన్నిక   •   మెడినోవా ఆసుపత్రిలో ఎన్ఐసీయు వైద్య సేవలు   •   ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడిని అరికట్టాలి   •   రాష్ట్ర స్థాయి రోప్ స్కిప్పింగ్ పోటీల్లో పారమిత విద్యార్థులకు పతకాలు   •   రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌లో సత్తా చాటిన గురుకుల డిగ్రీ అథ్లెటిక్స్ అకాడమీ క్రీడాకారిణిలు   •  

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి

28-08-2026 06:16 PM

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి,(విజయక్రాంతి): జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లు, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణాలతో పాటు గుడిసెల సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ, డీఆర్డీఓ, ఎంపీడీఓలు, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఇళ్ల నిర్మాణాల పురోగతిని పరిశీలించారు. జిల్లాకు 4,562 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, 851 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. సెప్టెంబర్ 15 నాటికి లక్ష్యాలను సాధించేలా నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు.

భూపాలపల్లి మండలంలో అదనంగా 200 ఇళ్లు, నియోజకవర్గంలో మొత్తం 1,100 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రారంభం కాని ఇళ్ల విషయంలో కారణాలను గుర్తించి లబ్ధిదారులతో మాట్లాడి పనులు ప్రారంభించేలా చూడాలన్నారు. అర్హులైన పేద కుటుంబాలు ఏవీ మిగిలిపోకుండా గుడిసెల సర్వేను పారదర్శకంగా పూర్తి చేయాలని సూచించారు. భాస్కర్‌గడ్డ 2బీహెచ్‌కే లేఅవుట్‌లో మురుగునీటి పారుదల, విద్యుత్, తాగునీటి పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఆర్డీఓ బాలకృష్ణ, పీఆర్ ఈఈ విద్యాసాగర్, డిప్యూటీ కలెక్టర్ నవీన్‌రెడ్డి, ఏఈ రాయలింగు, ఎంపీడీఓలు, ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.