అన్నాచెల్లెళ్ల దృఢమైన బంధానికి చిహ్నం రక్షాబంధన్
యాదగిరి సునీల్ రావు
ముకరంపుర,(విజయక్రాంతి): అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు, ఆత్మీయ బంధానికి రక్షాబంధన్ పండుగ సజీవ ప్రతీక అని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు పేర్కొన్నారు. రక్షాబంధన్ పండగను పురస్కరించుకొని అన్నాచెల్లెళ్ల అనురాగానికి, ఆత్మీయ బంధానికి ప్రతీకగా కరీంనగర్ లోని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు క్యాంప్ కార్యాలయంలో రాఖీ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు కార్పొరేటర్లు సుదగోని మాధవి కృష్ణ గౌడ్, గుగ్గిళ్ళ జయశ్రీ శ్రీనివాస్ తో పాటు బ్రహ్మకుమారీస్ సోదరీమణులు భగత్ నగర్ కు చెందిన కవిత మరియు ఇతర మహిళా సోదరీమణులు అందరూ క్యాంప్ కార్యాలయానికి విచ్చేసి, యాదగిరి సునీల్ రావుకు రాఖీలు కట్టి హృదయపూర్వక రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. తనపై ఎనలేని ప్రేమను, అభిమానాన్ని చూపి రాఖీలు కట్టిన సోదరీమణులందరికీ యాదగిరి సునీల్ రావు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.






