28 August, 2026 | 7:21 PM

సోదర భావానికి ప్రతీక.. రాఖీ పర్వదినం

28-08-2026 06:28 PM

అనురాగానికి... అద్దం పట్టే అపూర్వ వేడుక

జవహర్ నగర్ మాజీ డిప్యూటీ మేయర్ శ్రీనివాస్ గుప్త

జవహర్ నగర్,(విజయక్రాంతి): సోదర భావానికి, అన్నా చెల్లెలు అక్క తమ్ముళ్ల అనురాగానికి ప్రతీక ఈరాఖీ పర్వదినం అని జవహర్ నగర్ మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస గుప్తా పేర్కొన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శుక్రవారం రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆయన నివాసంలో జవహర్ నగర్ పరిధిలోని పలువురు సోదరి సోదరీమణుల సమక్షంలో రాఖీ పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు.

ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ తోబుట్టువుల బంధాన్ని పరివర్తనం చేసే ఈ పండుగ భావితరాలకు గొప్పతనానికి సూచిక అని, ఈ వేడుకలను సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అక్క చెల్లెళ్లకు తోడుగా ఎల్లప్పుడూ అన్న లేక తమ్ముడు ఉండాలని ఆయన తెలిపారు. సోదరుడు ఉన్నాడని ప్రతి సోదరికి ధైర్యం కల్పించాలని అప్పుడే ఈ పర్వదినానికి సార్ధకత చేకూరుతుందని తెలిపారు. ఈ రాఖీ పర్వదినాన్ని జవహర్ నగర్ లోని ప్రతి సోదరుడు సోదరీమణులు అత్యంత గౌరవపూర్వకంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.