అన్నా చెల్లెలు అక్క తమ్ముళ్లకు ప్రతీక రక్షాబంధన్
28-08-2026 06:35 PM
తూప్రాన్,(విజయ క్రాంతి): రక్షాబంధన్ ఒక పవిత్రమైన అన్న చెల్లెలు, అక్క తమ్ముళ్ల రక్త సంబంధాలను మెరుగుపరుచుకునే పండుగలలో అతి ప్రాముఖ్యమైనది. ఆప్యాయతలకు అనురాగాలకు పెట్టింది పేరుగా ఇంట్లో ఆడపడుచులు అన్న, తమ్ముళ్లకు రక్షాబంధన్ పర్వదినాన రాఖి కట్టి ప్రేమను చాటుకుంటారు. ఈ నేపథ్యంలో తూప్రాన్ బిఆర్ఎస్ మండల అధ్యక్షులు బొల్లంపల్లి బాబుల్ రెడ్డి కుటుంబంలో అనురాగాల సందడి నెలకొన్నది, వారి అక్కలు, చెల్లెలు ఆత్మీయంగా బాబుల్ రెడ్డి కి రాఖీ కట్టి నోరు తీపి చేసుకొని ఆప్యాయతను పంచుకున్నారు.






