28 August, 2026 | 9:49 AM

శ్రీపాద కాలనీలో రూ.28 లక్షలతో అభివృద్ధి పనులకు శ్రీకారం

27-08-2026 09:57 PM

డీఎంఎఫ్‌టీఎఫ్ నిధులతో రోడ్లు, డ్రైన్ల నిర్మాణం

మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రారంభం

మంథని,(విజయక్రాంతి): మంథని మున్సిపల్ పరిధిలోని శ్రీపాద కాలనీ అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. జిల్లా ఖనిజ నిధి ట్రస్ట్ నిధుల ద్వారా రూ.28 లక్షల వ్యయంతో నూతన రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక కౌన్సిలర్ కుర్ర లింగయ్య నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో మౌలిక వసతుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.

ప్రజలకు అవసరమైన ప్రాంతాల్లో రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులను చేపట్టి మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. నూతన రోడ్లు, డ్రైన్ల నిర్మాణం పూర్తయితే శ్రీపాద కాలనీ ప్రజలకు రాకపోకలు సులభతరం కావడంతో పాటు పారిశుద్ధ్య పరిస్థితులు కూడా మెరుగుపడతాయని తెలిపారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన మున్సిపల్ పాలకవర్గ సభ్యులను శాలువాలతో ఘనంగా సత్కరించారు.