ఫ్రోబెల్ మోడల్ హైస్కూల్‌లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు
27-08-2026 10:11 PM
గణపురం,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని ఫ్రోబెల్ మోడల్ హైస్కూల్‌లో రక్షాబంధన్ వేడుకలను గురువారం విద్యార్థులు, ఉపాధ్యాయుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలికలు బాలురకు రాఖీలు కట్టి సోదరభావాన్ని చాటుకున్నారు. ప్రిన్సిపాల్ ల్యాదల్ల కృష్ణ గౌడ్ మాట్లాడుతూ రక్షాబంధన్ ప్రేమ, ఆప్యాయత, పరస్పర గౌరవానికి ప్రతీక అని తెలిపారు. కరస్పాండెంట్ పబ్బ శివశంకర్ గౌడ్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. డైరెక్టర్లు ల్యాదల్ల. యాదగిరి గౌడ్, ఎస్. జగన్‌రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.






