సిద్దిపేట జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా రమేష్
సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు..
సిద్దిపేట రూరల, జూన్ 25: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ సెల్ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శిగా కోదాడి రమేష్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా తన నియామకానికి సహకరించిన రాష్ట్ర ఎస్సీ డిపార్ట్మెంట్ అధ్యక్షుడు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, డీసీసీ అధ్యక్షురాలు తూముకుంట ఆంక్షా రెడ్డి, సిద్దిపేట ఇన్‌చార్జి పూజల హరికృష్ణ, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు కరుణాకర్‌తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలకు రమేష్ కృతజ్ఞతలు తెలిపారు.
తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి రుణపడి ఉంటానన్నారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం, పార్టీ సిద్ధాంతాల ప్రచారానికి అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు.






