మైసయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం
30-06-2026 01:21 AM
వెల్దుర్తి, జూన్ 29 : వెల్దుర్తి మండల కేంద్రంలోని బోయిలగూడెంలో పిడుగుపాటుకు పానుగంటి మైసయ్య అకస్మాత్తుగా మరణించారు. ఆ విషయం స్థానిక వెల్దుర్తి మండల కాంగ్రెస్ నాయకుల ద్వారా తెలుసుకున్న నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఆవుల రాజు రెడ్డి తక్షణమే వారి పరిస్థితులను దృష్టి పెట్టుకొని తన సొంత నిధుల నుండి 20 వేల రూపాయలు ఆర్థిక స హాయం కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా అందజేయించారు.
ఆపద సమయంలో ఆ దుకుంటున్న ఆవుల రాజిరెడ్డిని అన్ని వర్గా ల వారు గుర్తు చేసుకుంటున్నారని గ్రామస్తు లు ఆశాభవం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, తలారి మల్లేష్, శేఖ గౌడ్, ఆంజనేయులు, కృష్ణ గౌడ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.






