10 May, 2026 | 8:12 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

డ్రగ్స్ నెట్‌వర్క్ ముఠా గుట్టురట్టు

27-02-2026 12:00 AM

నలుగురు అరెస్ట్, భారీగా గంజాయి స్వాధీనం

జూబ్లీహిల్స్,ఫిబ్రవరి 26(విజయక్రాంతి): నగరంలో మాదకద్రవ్యాల నిర్మూలన కోసం పోలీసులు చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో భాగం గా భారీ గంజాయి ముఠా పట్టుబడింది. టాస్క్ ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపిన వివరాల ప్రకారం కమిషనర్ టాస్క్ ఫోర్స్ జూబ్లీహిల్స్ జోన్ టీమ్, లాలాగుడా పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో ఒడిశాకు చెందిన సరఫరాదారు నాగేశ్వరరావు కెల్లోతో పాటు విక్రేత హర్దీప్ సింగ్, వినియోగదారులు ప్రియాంత్ విజ య్, గంధం గోవర్ధన్లను పోలీసులు అరెస్ట్ చేశారు.

మెట్టుగూడ రైల్వే హాస్పిటల్ సమీపంలో గంజాయి చేతులు మారుతుండగా పోలీసులు మెరుపు దాడి చేసి వీరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి సుమారు రూ. 2,00,000 విలువైన 4 కేజీల ఎండు గంజాయిని, 3 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాకు చెందిన నాగేశ్వరరావు కెల్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల అదే ప్రాంతానికి చెందిన సాయి బా గొలోరి అనే వ్యక్తి సూచనలతో గంజా యి రవాణాకు పాల్పడుతున్నాడని పోలీసుల విచారణలో తేలింది.

ట్రావెల్స్ బస్సు లో సికింద్రాబాద్ చేరుకున్న నాగేశ్వరరావు, ఇక్కడి విక్రేతలకు గంజాయిని సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ ఆపరేషన్ను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్ సిహెచ్.యదేందర్, జుబ్లీహిల్స్ జోన్ టాస్క్ ఫోర్స్ ఎస్‌ఐడి రవిరాజ్, వారి బృం దం విజయవంతంగా పూర్తి చేశారు. మాదకద్రవ్యాల వల్ల యువత తమ విలువైన భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని డీసీపీ ఈ సందర్భంగా హెచ్చరించారు.

సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతోనో, వ్యసనాలకో బానిసలై నేరాల బాట పట్టవద్దని, ఇది కేవలం కెరీర్ను మాత్రమే కాకుండా కుటుంబాలను కూడా చిన్నాభిన్నం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. నగరాన్ని డ్రగ్స్ రహితంగా మార్చేందుకు ప్రజలు సహకరించా లని, ఏదైనా అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే డయల్ 100కు కాల్ చేయాలని ఆయన కోరారు.