కామారెడ్డిలో రాజీవ్ జ్యోతి సద్భావన యాత్ర
డిసిసి అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ ఆధ్వర్యంలో సద్భావన యాత్ర కు ఘన స్వాగతం
కామారెడ్డి,(విజయక్రాంతి): దేశ ఐక్యత, జాతీయ సమైక్యత, మత సామరస్యం, సద్భావన సందేశంతో ముందుకు సాగిన 35వ రాజీవ్ జ్యోతి సద్భావన యాత్ర శుక్రవారం కామారెడ్డికి చేరుకుంది. డిసిసి అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ రాజీవ్ జ్యోతి సద్భావన యాత్రకు స్వాగతం పలికారు. కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ఆధ్వర్యంలో యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ శ్రేణులకు ఘన స్వాగతం పలిపారు.
2026 ఆగస్టు 9న శ్రీపెరంబుదూర్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల మీదుగా సాగుతూ ఆగస్టు 20న న్యూఢిల్లీలో ముగియనుంది. దేశ నిర్మాణంలో మాజీ ప్రధాని, దివంగత రాజీవ్ గాంధీ అమూల్యమైన సేవలను స్మరించుకుంటూ, జాతీయ సమైక్యత, మత సామరస్యం, దేశ సమగ్రత కోసం ఆయన కలలను ప్రజల్లోకి తీసుకెళ్లడం యాత్ర ప్రధాన ఉద్దేశ్య మన్నారు.
కామారెడ్డిలో జరిగిన కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి , మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ , మాజీ డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ , కామారెడ్డి టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు ఐరేని సందీప్ కుమార్ , కామారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






