14 August, 2026 | 5:14 PM

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పై స్టే.. కాంగ్రెస్ కుట్రే

14-08-2026 04:25 PM

బిఆర్ఎస్ నేత దొడ్డి తాతారావు ఆరోపణ..

చర్ల,(విజయక్రాంతి): పేద ఆడబిడ్డలకు అండగా నిలిచే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టు స్టే విధించడానికి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని బిఆర్ఎస్  చర్ల మండల కన్వీనర్ దొడ్డి తాతారావు ఆరోపించారు. పేదలకు ఈ పథకాలు అందకుండా చేయాలనే దుర్బుద్ధితో ప్రభుత్వం కోర్టులో కావాలనే కౌంటర్ దాఖలు చేయడం లేదని మండిపడ్డారు. హైకోర్టు పలుమార్లు అవకాశం ఇచ్చినా కౌంటర్ అఫిడవిట్ వేయకపోవడం బాధ్యతారాహిత్యమన్నారు. 2014లో కెసిఆర్ ప్రారంభించిన ఈ పథకాల ద్వారా లక్షలాది ఎస్సీ ఎస్టీ బీసీ  మైనారిటీ ఆడబిడ్డలకు లబ్ధి చేకూరిందని గుర్తు చేశారు. సెప్టెంబర్ 9లోగా బలమైన కౌంటర్ వేసి స్టే ఎత్తివేయాలని, పెండింగ్ లబ్ధిదారులకు వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.