14 August, 2026 | 7:49 PM

శిశుగృహ బాబును దత్తత తీసుకున్న దంపతులు

14-08-2026 04:41 PM

ముకరంపుర,(విజయక్రాంతి): పిల్లలు లేని దంపతులు కరీంనగర్ శిశు గృహానికి చెందిన బాబును దత్తత తీసుకున్నారు. శుక్రవారం రోజున పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన దంపతులకు కరీంనగర్ శిశు గృహలోని 4నెలల బాబు ను జిల్లా సంక్షేమ అధికారి యం.సరస్వతి చే దత్తత అందించడమైనది. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లలు లేని దంపతులు చట్టబద్ద మైన పద్ధతులతో దత్తత తీసుకోవాలని తెలిపారు. దత్తత తీసుకోవాలి.

అనుకునేవారు పూర్తి సమాచారం నిమిత్తం జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, జిల్లా పరిషత్ కార్యాలయం నందు సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  సిడబ్ల్యుసి మెంబర్ కళింగ శేఖర్, బి. రాధ, డిసిపిఓ పర్వీన్, శిశు గృహ ఇంచార్జీ అపూర్వ ,సూపరింటెండెంట్ నర్మద, కరీంనగర్ జిల్లా సిడిపిఓ లు కవిత, శ్రీలత, సుగుణ, నర్సింగరాణి, జె.తిరుపతి,సంపత్, మునిగంటి రాజ్ కుమార్, సాదినేని రమేష్, మహేష్, సిబ్బంది పాల్గొన్నారు.