14 August, 2026 | 5:12 PM

బిక్కనూర్ ఎంపీడీవోగా సవిత బాధ్యతల స్వీకరణ

14-08-2026 04:35 PM

బిక్కనూర్,(విజయక్రాంతి): బిక్కనూర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా సవిత శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో తాడ్వాయి మండలంలో ఎంపీడీవోగా విధులు నిర్వహించిన ఆమె బదిలీల్లో భాగంగా బిక్కనూర్‌కు వచ్చారు. ఈ సందర్భంగా సవిత మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది సహకారంతో మండల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. నూతన ఎంపీడీవోకు కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.