14 August, 2026 | 6:42 PM

ఆయిల్ పామ్ సాగుతో దీర్ఘకాలిక ఆదాయం: ఆత్మ చైర్మన్

14-08-2026 04:37 PM

బోథ్,(విజయక్రాంతి): ఆయిల్ ఫామ్ సాగుతో రైతులకు దీర్ఘకాలి కాదాయం లభిస్తుందని ఆత్మ చైర్మన్ గొర్ల రాజు యాదవ్ పేర్కొన్నారు. శనివారం మండలంలోని మేడిశివారంలో రైతు భగవాన్ రెడ్డి సాగు చేస్తున్న పామాయిల్ తోటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు. ఆయిల్ ఫామ్ సాగు చేసిన రైతాంగానికి దీర్ఘకాలికంగా ఆదాయం ఉంటుందన్నారు. ఆయిల్ ఫామ్ సాగు చేసే చేలలో అంతర పంటను సైతం సాగు చేసుకోవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో హార్టికల్చర్ అధికారి భూమయ్య, బోత్ బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు నరసింహ దాస్, కాంగ్రెస్ యువ నాయకుడు అల్పటి అచ్యుతానంద రెడ్డి ,సన్నీ రెడ్డి, రైతు నోముల భగవాన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.