14 August, 2026 | 5:13 PM

వృద్ధాప్య బీడీ కార్మికులకు పెన్షన్లు అందించాలి

14-08-2026 04:29 PM

బోథ్,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు బీడీ కార్మికులకు పెన్షన్లను మంజూరు చేయాలని సోనాల మండల బి ఆర్ ఎస్ నాయకులు ఎంపీడీవో రత్నాకర్ రావు శుక్రవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు గత 12 సంవత్సరాలుగా బీడీ కార్మికులు పెన్షన్ సౌకర్యానికి నోచుకోవడం లేదని, 2014 కటప్ డేట్ గా నిర్ణయించి బీడీ కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ప్రతి బీడీ కార్మికురాలికి పెన్షన్ ఇవ్వాలని, అర్హులైన వృద్ధులందరికీ పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బి ఆర్ యస్ నాయకులు ఈర్ల అభిలాష్, యల్ల సుధీర్ రెడ్డి, చిలుముల పంచాక్షరి ,తుల హరీష్ లు ఉన్నారు.