14 August, 2026 | 5:15 PM

విద్యార్థులకు షూస్ అందజేత

14-08-2026 04:22 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణం 7వ వార్డు సుభాష్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన "యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్" పథకం ద్వారా విద్యార్థులకు బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ దావస్వాతి ఉచితంగా షూష్ ను  అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ దావస్వాతి మాట్లాడుతూ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొవాలన్నారు. క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాక్షించారు. అనంతరం 7వ వార్డు లోని ఇందిరమ్మ ఇంటి పథకం లబ్దిదారులు పెండెం రాజు ఇందిరమ్మ ఇంటి నూతన గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్నారు.