గీతా కార్మికుడు శ్రీనివాసును ప్రభుత్వం ఆదుకోవాలి
14-08-2026 04:31 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణానికి చెందిన గీత కార్మికుడు అంతటి శ్రీనివాస్ ఈ నెల 1న తాటిచెట్టు నుంచి ప్రమాదవశాత్తు కిందపడి తీవ్ర గాయాలు కు గురై పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని శుక్రవారం సుల్తానాబాద్ గౌడ సంఘం అధ్యక్షుడు పొన్నం తిరుపతి గౌడ్ ఆధ్వర్యంలో పలువురు గీత కార్మికులు ఆసుప త్రికి వెళ్లి బాధితుడు అంతటి శ్రీని వాస్‌ను పరామర్శించారు. ప్రమాదానికి గురైన శ్రీనివాస్‌కు తక్షణ ఆర్థిక సహాయం అందించి కుటుంబాన్ని ఆదుకో వాలని గౌడ సంఘం నాయకులు, గీత కార్మికులు ప్రభుత్వాన్ని కోరా రు.






