20 August, 2026 | 2:49 PM

యువతరాన్ని మేలుకొలిపింది రాజీవ్ గాంధీ

20-08-2026 12:55 PM

బోథ్ ఆగస్టు 20 (విజయక్రాంతి): భారతదేశంలో 18 సంవత్సరాలు నిండిన యువకులకు ఓటు హక్కు కల్పించి యువతరాన్ని మేల్కొలిపింది రాజీవ్ గాంధీ అని సోనాల కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని మండల కేంద్రంలో వేడుకలను నిర్వహించారు. మాజీ ప్రధాని 1984 నుండి 89 వరకు ఎన్నో సేవలు అందించారు అన్నారు.

విద్యా వ్యవస్థలో కంప్యూటర్ సాంకేతిక విద్య కమ్యూనికేషన్ వ్యవస్థను మెరుగుపరిచారు అన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి ఎంతగానో కృషి చేసిన ఘనత ఆయనకు దక్కింది అన్నారు. కార్యక్రమంలో డిసిసి కార్యదర్శి ఎల్ .పోశెట్టి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గుడాల అనిష్, డిసిసి ఎస్సి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి బీమ్ రావు పాటిల్, సోనాల మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు చౌహన్ వినోద్ సింగ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సోమన్న మునేశ్వర్ జుంగలభోజన్నమాజీ, సర్పంచ్ సోయం బాబూరావు,, రమేష్ బాసెట్టి సుదర్శన్ ,చిలుకూరి నరేందర్ రాజారామ్ ఇబ్రహీం బండు సుధీర్ కుమార్, మద్దెల మహేష్, భోజరాజు తదితరులు పాల్గొన్నారు.