20 August, 2026 | 2:42 PM

కాంగ్రెస్ లో చేరిన ఇంద్రవెల్లి మండల యువత

20-08-2026 01:41 PM

కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్...

ఉట్నూర్, ఆగస్టు 20(విజయక్రాంతి): రాజీవ్ గాంధీ జయంతి సందర్భాభంగా ఇంద్రవెల్లి మండల యువతకు కండువా వేసి కాంగ్రెస్ పార్టీలోకి నిర్మల్ డిసిసి అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆహ్వానించారు. స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున యువత కాంగ్రెస్ లో చేరడం హర్షణీయం అని ఎమ్మెల్యే  పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై,ఇంద్రవెల్లి నాయకుల ప్రోత్సాహం తో పార్టీలో చేరిన ఇంద్రవెల్లి మండల యువతకు వెడ్మ బొజ్జు పటేల్  శుభాకాంక్షలు తెలిపారు.పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న యువతను పార్టీ గుర్తించి,అనేక అవకాశాలు కల్పిస్తుంది అని కొనియడారు, ఇంద్రవెల్లి మండల అధ్యక్షులు MD జహీర్, పట్టణ అధ్యక్షులు జితేందర్, AMC చైర్మెన్ ముఖడే ఉత్తమ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఇంద్రవెల్లి SC Cell మండల అధ్యక్షులు కాంబ్లె బాబా రావ్, మాజీ సర్పంచ్ కోరేంగ సుంకట్ రావ్, యువకులు తుంగపిండి ఉదయ్ రాజ్(టిల్లు),లింగంపల్లి సాయి తేజ,గజ్జెల రాజు,సంతోష్, కార్తీక్,ప్రసాద్ మరియు పెద్దఎత్తున యువత కాంగ్రెస్ లో చేరారు.