మాజీ ఎమ్మెల్యే మర్రి ఓవరాక్షన్..!
ఆర్డీవోకి వినతి పత్రం పేరుతో కార్యకర్తలతో పాటు కార్యాలయం లోకి తోసుకొచ్చిన మర్రి.
పోలీసులని తోసివేస్తూ హంగామా.
నాగర్ కర్నూల్, (విజయక్రాంతి): కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కొనసాగించాలని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా అనంతరం స్థానిక ఆర్డిఓకి వినతి పత్రం ఇచ్చే క్రమంలో నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే(Former Nagarkurnool MLA) మర్రి జనార్దన్ రెడ్డి ఓవరాక్షన్ చేశారు. ఐదు మంది మహిళలతో పాటు వినతి పత్రం అందించేందుకు అనుమతించిన పోలీసులను కార్యకర్తలతో కలిసి తోసుకుంటూ ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలోకి చొచ్చుకెళ్లారు.
విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందిని తోసుకుంటూ హంగామా సృష్టించడం తీవ్ర కలకలం రేపుతుంది. ధర్నా ప్రదేశంలో స్థానిక సీఐ అశోక్ రెడ్డిని టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్ తో గందరగోళం నెలకొన్న అనంతరం ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్న సమయంలోనూ సహనం కోల్పోయి పోలీసులపై చేతులతో నేడుతూ ఆర్డిఓ కార్యాలయ ప్రాంగణంలోకి చొచ్చుకెళ్లారు. దీంతో తీవ్ర గందరగోల వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై పోలీసులు కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.






