20 August, 2026 | 3:25 PM

రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు

20-08-2026 01:46 PM

రాజన్న సిరిసిల్ల 20, ఆగస్టు(విజయక్రాంతి): స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సిరిసిల్ల గాంధీ చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. సిరిసిల్ల కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సూర దేవరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ పాల్గొని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా 18 సంవత్సరాలు నిండిన యువతకు కొత్త ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు అవసరమైన దరఖాస్తు ఫారాలను అందజేశారు. యువత ప్రజాస్వామ్య ప్రక్రియలో చురుకుగా భాగస్వాములు కావాలని నాయకులు సూచించారు. అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మాట్లాడుతూ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అనేక కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు