calender_icon.png 23 February, 2026 | 3:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజన్న స్వామి జాతర ప్రారంభం

23-02-2026 12:07:24 AM

నేడే అగ్నిప్రదేశం 

జహీరాబాద్, ఫిబ్రవరి 22 :ప్రజలకు ముక్తిదాతగా పేరుందిన శ్రీ రాచన్న స్వామి భ్రమరాంబ మల్లికార్జున దేవాలయ జాతర మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహిర్ మండల పరిధిలోని బరంపేట గ్రామంలో కొలువైన శ్రీ రాజన్న స్వామి దేవాలయ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లను చేశారు.

ఆదాయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాటు చేసినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి శివ రుద్రప్ప తెలిపారు. ఈ జాతర మహోత్సవంలో రాజన్న స్వామి దేవాలయంలో వివిధ రకాల పూజలతో స్వామివారిని పూజిస్తారు. సోమవారం సాయంత్రం అగ్ని ప్రవేశం చేయనుండగా, మంగళవారం ఉదయం అగ్ని తొక్కుటకు భక్తులు వేల సంఖ్యలో తరలివస్తారు. స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు సౌకర్యార్థం కోసం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక బస్సులను నడుపుతుంది.

ఈనెల 24న రాజన్న స్వామి కాళికాదేవి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. కళ్యాణ మహోత్సవం అనంతరం కాలికామాత రాచన్న స్వామిని ప్రత్యేక రథంలో ఉంచి ఊరేగింపు నిర్వహిస్తారు. జహీరాబాద్ కు చెందిన కౌలాస్ పరివార్ వారిచే గురువు రాజన్న స్వామి అశ్వవాహనంపై గ్రామంలో ఊరేగింపు నిర్వహిస్తారు. ఇక్కడ వెలిసిన అమృతగుండంలో ప్రత్యేక స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకుంటారు.