calender_icon.png 23 February, 2026 | 5:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉచిత మెగా వైద్య శిబిరం

23-02-2026 12:06:47 AM

దమ్మపేట, ఫిబ్రవరి 22(విజయక్రాంతి): మండల పరిధిలోని పట్వారి గూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సత్తుపల్లికి చెందిన ప్రముఖ వైద్యశాలలు శ్రీనిధి హాస్పిటల్, లైఫ్ కేర్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రావడం చాలా అవసరముందని తెలిపారు. నియోజకవర్గ ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఇటువంటి ఉచిత హెల్త్ క్యాంపులు ప్రజలకు ఎంతో మేలు చేస్తాయని,

ముఖ్యంగా ముందస్తు వైద్య పరీక్షల ద్వారా వ్యాధులను తొందరగా గుర్తించి చికిత్స పొందే అవకాశం కలుగుతుందని అన్నారు. ఈ వైద్య శిబిరాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న శ్రీనిధి, లైఫ్ కేర్ ఆస్పత్రుల యాజమాన్యాన్ని వైద్యులను, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా అశ్వారావుపేట నియోజకవర్గంలో నిర్వహించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో దమ్మపేట మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వాసం రాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు, పట్వారిగూడెం సర్పంచ్ కూరం అర్జున్ రావు, వైస్ సర్పంచ్ బొల్లికొండ నాగేశ్వరరావు, వంకా జానకీరాముడు, మోకాళ్ల గురుమూర్తి, అశ్వారావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు, దమ్మపేట ఎస్త్స్ర సాయికిషోర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామపెద్దలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.