స్పేస్ సెక్యూరిటీపై డీఆర్డీవో సదస్సు
ముగిసిన ఐసీఈఎస్‌ఏఐఏ
హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని మెథడిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో నిర్వహించిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్- (ఐసీఈఎస్‌ఏఐఏ సదస్సు శనివారం ముగిసింది. వాలెడిక్టరీ కార్యక్రమంలో డా అనుపమ్ శర్మ, ఔట్ స్టాండింగ్ సైంటిస్ట్ అండ్ డైరెక్టర్, డైరెక్టరేట్ ఆఫ్ స్పెషల్ ప్రాజెకట్స్ (డీఎస్పీ), డీఆర్డీవో, స్వదేశీ అంతరిక్ష సాంకేతికతలు, అధునాతన స్పేస్ సిట్యుయేషనల్ అవేర్నెస్ (ఎస్‌ఎస్‌ఏ), డిజిటల్ ట్విన్ టెక్నాలజీ, సురక్షిత ఉపగ్రహ వ్యవస్థల అభివృద్ధిని వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు.
అంతరిక్ష భద్రతకు ఇవి కీలకమని ఆయన పేర్కొన్నారు. మూడు రోజుల ఈ సదస్సును మెథడిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (ఆటానమస్), స్టాన్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ వుమెన్ (ఆటానమస్) సంయుక్తంగా, ఐఈఈఈ హైదరాబాద్ సెక్షన్ సాంకేతిక సహకారంతో నిర్వహించాయి. ఈ సందర్భంగా డా. జగన్నాథ్ నాయక్, డిస్టింగ్విష్డ్ సైంటిస్ట్ అండ్ డైరెక్టర్ జనరల్ (మిస్సైల్స్ అండ్ స్ట్రాటజిక్ సిస్టమ్స్), డీఆర్డీవో, స్వదేశీ సెమీకండక్టర్ అభివృద్ధి అవసరాన్ని వివరించగా, డా. విశ్వజిత్ ఠాకూర్, డీన్, ఇంద్రశిల్ యూనివర్సిటీ, గెస్ట్ ఆఫ్ ఆనర్‌గా హాజరయ్యారు. సదస్సుకు 11 దేశాల నుంచి 1,593 పరిశోధనా పత్రాలు రాగా, వాటిలో 162 పేపర్లు ఆమోదం పొందినట్లు నిర్వాహకులు తెలిపారు.






