రాజారవీంద్ర వైల్డ్
01-05-2026 01:34 AM
నటుడు రాజారవీంద్ర ప్రధాన పాత్రలో ‘వైల్డ్’ అనే సినిమా రాబోతోంది. వయోలెంట్ సైకో థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని డైరెక్టర్ సాయిరాం దాసరి తెరకెక్కించనున్నారు. ఓవా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రవి పీట్ల నిర్మించనున్న ఈ మూవీ లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకోనుంది. ఆ వెంటనే రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతోందీ టీమ్. ఈ మేరకు మేకర్స్ ఈ సినిమాను ప్రకటిస్తూ.. ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. మోషన్ పోస్టర్‌లో రాజారవీంద్ర రక్తంతో తడిసిపోయిన వయలెంట్ లుక్‌లో కనిపించడం ఆసక్తి కలిగిస్తోంది. మేకర్స్ ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.






