23 August, 2026 | 2:33 AM

మంత్రి అడ్లూరికి ఘన స్వాగతం సన్మానం చేసిన టీపీసీసీ వైస్ చైర్మన్ దుర్గం శేఖర్

23-08-2026 12:47 AM

ఉట్నూర్,(విజయక్రాంతి): ఉట్నూర్ మండల కేంద్రంలో శనివారం పర్యటించిన రాష్ట్ర గిరిజన, సాంఘిక సంక్షేమ & దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి వర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ లను టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ స్టేట్ వైస్ చైర్మన్ దుర్గం శేఖర్ పూల బొకే అందించి ఘన స్వాగతం పలికారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు  దళిత సంఘము  నేతలతో కలసి శాలువాతో సన్మానం చేసారు.

ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా నివసిస్తున్న దళితులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు, వారి సంక్షేమం, హక్కులు, అభివృద్ధికి సంబంధించిన అంశాలపై మంత్రి  దృష్టికి తీసుకెళ్లి, సమస్యల పరిష్కారం కోరుతూ వినతి పత్రాలు అందజేశారు.  ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలోని దళిత రైతులు సాగు చేస్తున్న భూములకు అక్కు పత్రాలు అందించడంతోపాటు  రాష్ట్ర ప్రభుత్వం చేసిన రుణమాఫీ పథకాన్ని అమలు చేయాలని, పంటలు రుణాలు  ఇప్పించాలని కోరారు.జిల్లాలో దళిత వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం మరింత ప్రాధాన్యత ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు.

దళితుల సమస్యలను మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సానుకూలంగా విని, ప్రతి అంశాన్ని పరిశీలించి సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని, దళితుల సంక్షేమం మరియు అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దళితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని మంత్రి వర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఇంద్రవెల్లి అధ్యక్షులు జీతేందర్ సొన్ కాంబ్లె. ఆదిలాబాద్ జిల్లా అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బీంరావ్ వాగ్మారె ప్రధాన కార్యదర్శి దాదాషాహెబ్ జాబడే. దళిత సంఘాల నాయకులు చందల రాజన్న , నక్క రాందాస్ , ఆదిలాబాద్ జిల్లా మీడియా కోఆర్డినేటర్ మేకల జితేందర్,  ముక్కెర అశోక్  పాల్గొన్నారు.