పోలీస్ సిబ్బందికి రెయిన్ కోట్లు పంపిణీ
07-07-2026 01:19 AM
ములుగు (మహబూబాబాద్) జులై 6 (విజయక్రాంతి): వర్షాకాలంలో విధి నిర్వహణలో సిబ్బంది ఇబ్బంది పడకూడదని సోమవారం ములుగు జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్ సిబ్బందికి రెయిన్ కోట్లను పంపిణీ చేశారు. తద్వారా సిబ్బంది కూడా తమ విధులను నిబద్ధతతో నిర్వహిస్తారని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో అలసత్వం వహించరాదని సిబ్బందిని ఆదేశించారు. విధి నిర్వహణలో ఏవైనా ఆటంకాలు ఏర్పడినా, ఏవేని సమస్యలు ఎదురైనా వెంటనే తమ పై అధికారులకు తెలియజేయాలని సూచించారు. అవసరమైతే తనను కూడా ఎప్పుడైనా సంప్రదించవచ్చునని, తాను ఎల్లవేళలా క్రింది స్థాయి సిబ్బందికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సదానందం, ఆర్ ఐ స్వామి పాల్గొన్నారు






