7 July, 2026 | 2:22 AM

క్షేత్ర స్థాయిలో విచారణ త్వరగా చేయాలి

07-07-2026 01:18 AM

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా 

జనగామ, జులై 6 (విజయక్రాంతి): జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చి తమ సమస్యలపైన వినతులను సమర్పించే ప్రజలకు నమ్మకం కలిగేల. వారి సమస్యలను త్వరితగతిన పరిష్కారించేందుకు జిల్లా అధికారులు కృషి చేయాలనీ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు.

సోమవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోంతో కలిసి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వినతిపత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజల నుంచి కలెక్టర్ స్వయంగా ఫిర్యాదులను తీసుకుని.. వారి సమస్యలను అడిగి తెలుసుకుని, సమస్య పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

ప్రజల వినతులను పెండింగ్లో లేకుండా దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని, పారదర్శకంగా ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం అని స్పష్టం చేశారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా.. వారి అర్జీలను త్వరగా పరిష్కరించాలని, సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సంబంధిత శాఖల జిల్లా అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ భాస్కర్, గృహ నిర్మాణ శాఖ పీడీ మాతృ నాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.