14 May, 2026 | 5:14 AM

రైతులపై రైల్వే అధికారుల బెదిరింపులు నిలిపివేయాలి

14-05-2026 01:48 AM

మధిర, మే13 (విజయక్రాంతి): రైతులపై రైల్వే అధికారుల బెదిరింపులు నిలిపివేయాలని సిపిఎం మధిర మండల కార్యదర్శి మందా సైదులు, రైతు సంఘం మండల కార్యదర్శి మందడపు ఉపేంద్ర రావులు అన్నారు. బుధవారం తహసిల్దార్ రాళ్లబండి రాంబాబుకు రైతుల సమస్యను తెలియజేశారు.

ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ... రైల్వే పనులకు సంబంధించిన హద్దులు కేటాయింపులు కొత్తగా ఏమి జరగలేదని రైతులు ఆందోళన చెందవద్దని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి మందడపు ఉపేంద్ర రావు, చావా వెంకటేశ్వరరావు, గుర్రం వెంకట్రావు, ఓట్ల శంకర్రావు, అద్దంకి భాస్కరరావు,యడ్లపల్లి వెంకటేశ్వరరావు, యడ్లపల్లి నరసింహారావు, యడ్లపల్లి శ్రీనివాసరావు, చెరుకూరి చందర్రావు,  ఐతం కృష్ణారావు ఐతం వెంకటేశ్వరరావు, ఓట్ల రఘుబాబు, మాదాల శరత్ చుంచు విజయ్ తదితరులు పాల్గొన్నారు.