రాష్ట్రంలో రైల్వే అభివృద్ధి పనులు 40 వేల కోట్లతో..
- 42 రైల్వేస్టేషన్ల ఆధునీకరణ
- అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో నాంపల్లి స్టేషన్ అభివృద్ధి
- ఈ ప్రాజెక్టుకు కేంద్రం రూ. 350 కోట్లు కేటాయింపు
- కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి
హైదరాబాద్, మార్చి 5 (విజయక్రాంతి): తెలంగాణలో రూ. 40 వేల కోట్లకుపైగా నిధుల తో రైల్వే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో నాంపల్లి రైల్వేస్టేషన్ అభివృద్ధి చేస్తామని చెప్పారు. గురువారం నాంపల్లిలోని హైదరాబాద్ రైల్వేస్టేషన్ పనుల పరిశీలించిన అనంతరం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
తెలంగాణలో 42 రైల్వేస్టేషన్లను ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం నాంపల్లి స్టేషన్‌కు రోజుకు 60 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయని, ప్రతిరోజూ దాదా పు 20వేల మంది ప్రయాణికులు నాంపల్లి రైల్వేస్టేషన్‌ను వినియోగిస్తున్నారన్నారు. పెరుగుతు న్న అవసరాలను దృష్టిలో పెట్టుకొని స్టేషన్‌ను సమగ్రంగా అప్‌గ్రేడ్ చేస్తున్నామని తెలిపారు.
రూ. 327 కోట్లతో టెండర్లు..
ఈ ప్రాజెక్ట్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 350 కోట్లు కేటాయించిందని తెలిపారు. టెండ ర్ ప్రక్రియలో రూ. 327 కోట్లు ఖరారయ్యాయ ని చెప్పారు. అవసరమైతే రెండో దశలో మరిన్ని నిధులు సమకూర్చి, అత్యాధునిక ప్రమాణాలతో నిర్మాణాన్ని పూర్తిచేస్తామన్నారు.
స్టేషన్ పైభాగంలో సుమారు 6,500 స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంతో సె ంట్రల్ హాల్ నిర్మిస్తున్నామని, అందులో రెస్టారెంట్, ఫుడ్ కోర్ట్, ఇతర స్టాల్స్ ఏర్పాటుతో పా టు ప్రయాణికులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పిస్తామని పేర్కొన్నారు. ఇతరత్ర అన్ని ఆధునిక సదుపాయాలు కల్పిస్తున్నామని చె ప్పారు. ఈ పనులను 2027 చివరినాటికి పూ ర్తి చేయాలనే లక్ష్యంగా నిర్దేశించుకున్నామని తెలిపారు.
అభివృద్ధి పనులు వేగవంతం..
తెలంగాణలో రైల్వే అభివృద్ధి వేగవంతంగా జరుగుతోందని తెలిపారు. గతంలో 2014లో తెలంగాణకు రూ.258 కోట్లు మాత్రమే కేటాయించేవారని, ప్రస్తుతం రూ.5,454 కోట్లు కేటాయిస్తున్నామని ఆయన తెలిపారు. తెలంగాణలో మొత్తం రూ.47,984 కోట్ల విలువైన రైల్వే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, 346 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్లు పూర్తి చేశామని, 513 కిలోమీటర్ల లైన్లను డబ్లింగ్/ట్రిప్లింగ్ /అప్గ్రేడ్ చేశామన్నారు.
సికింద్రాబాద్- డబ్లింగ్, రాఘవాపురం మంద మర్రి ట్రిప్లింగ్, కాజీపేట- ట్రిప్లిం గ్, ఎలక్ట్రిఫికేషన్ పనులు వేగంగా సాగుతున్నాయని, చెర్లపల్లి నూతన రైల్వే టర్మినల్‌ను అభి వృద్ధిచేసి ప్రజలకు అంకితం చేశామని, బేగంపేట రైల్వేస్టేషన్‌ను పూర్తిగా మహిళల సిబ్బం దితో నడిపే ఆధునిక స్టేషన్‌గా తీర్చిదిద్దామన్నా రు. తెలంగాణలో 1,979 కిలోమీటర్ల రైల్వే లైన్ ఎలక్ట్రిఫికేషన్ పూర్తిచేశామని, ఒక్క కొత్త లైన్ మినహా 100 శాతం ఎలక్ట్రిఫికేషన్ సాధించామని,
స్వదేశీ సాంకేతికతతో కూడిన కవచ్ సిస్ట మ్‌ను ప్రమాదాలు నివారించేందుకు అమలు చేస్తున్నా మని, 639 కిలోమీటర్ల పరిధిలో, 63 స్టేషన్లలో ఇది అమలుచేశామన్నారు. వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ ద్వారా స్థానిక ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తున్నామని, తెలంగాణలో చెర్లపల్లి, కరీంనగర్, బేగంపేట, వరంగల్ స్టేషన్లు పూర్తయ్యాయని, మిగతావి వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. వరంగల్‌లో రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ అభివృద్ధి జరుగుతోందని చెప్పారు.
ఎనిమిది మంది ఎంపీలను ఇవ్వకుంటే..
తెలంగాణ ప్రజలు తమకు ఎనిమిది మంది ఎంపీలను గెలిపించకపోయి ఉంటే, ఈ స్థాయిలో రైల్వే అభివృద్ధి జరిగేదా? అని ఆయన ప్రశ్నించారు. ఇటీవల బడ్జెట్‌లో ప్రకటించిన హైస్పీడ్ ఎలివేటెడ్ కారిడార్లు.. మొత్తం ఏడు ప్రకటిస్తే, అందులో మూడు తెలంగాణకు రావడం గొప్ప విషయమన్నారు. పాండురంగాపురం మధ్య 173 కిలోమీటర్ల కొత్త లైన్‌కు రూ.3,591 కోట్లు, బీబీనగర్ నుంచి గుంటూరు వరకు డబ్లింగ్ ప్రాజెక్ట్ రూ. 2,480 కోట్లు,
ముత్కోడ్ నుంచి డోన్ వరకు 405 కిలోమీటర్ల ప్రాజెక్ట్ రూ. 4,686 కోట్లు.. ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్ నుంచి వాడి వరకు థర్డ్, ఫోర్త్ లైన్‌కు రూ. 512 కోట్లు, హైదరాబాద్‌లోని ఎంఎంటీఎస్‌ను యాదాద్రి వరకు విస్తరిస్తున్నామని, రెండోదశకు రూ. 450 కోట్లతో త్వరలో భూమిపూజ కూడా జరగబోతోందన్నారు.




