చీలపల్లిలో వెలగని విద్యుత్ దీపం
06-03-2026 01:48 AM
చిమ్మచీకట్లో పోచమ్మ ఆలయం
భయాందోళనలో భక్తులు
మునిపల్లి, మార్చి 5 : మండల పరిధిలోని చీలపల్లి గ్రామంలో గల పోచమ్మ ఆలయం చిమ్మచీకట్లో కొట్టుమిట్టాడుతుంది. రాత్రి అయితే చాలు ఆ ఆలయానికి వెళ్లి సేద తీరుదామనుకుంటే విద్యుత్ దీపాలు లేకపోవడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయం పంచాయతీ కార్యదర్శికి, గ్రామ సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు, భక్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిదులు స్పందించి పోచమ్మ దేవాలయం వద్ద విద్యుత్ దీపాలు వెలిగేలా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.




