ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక విజయవంతం చేయాలి
99 రోజుల కార్యక్రమంపై కలెక్టర్ ప్రావీణ్య దిశానిర్దేశం
సంగారెడ్డి, మార్చి 5: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 99 రోజుల పాటు చేపట్టనున్న ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య ఆదేశించారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక పై జిల్లాలో నిర్వహించాల్సిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కా ర్యక్రమాలపై గురువారం కలెక్టరేట్ సమావేశమందిరంలో ప్రత్యక్ష సమీక్ష సమావేశంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
అలాగే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి అధికారులు, రెవెన్యూ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. ఈ సంద ర్భముగా ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను అర్హులైన ప్రతి లబ్ధిదారునికి పారదర్శకంగా అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
ప్రజలకు ప్రయోజనం చేకూరే విధంగా పథకాలు అ మలు చేయాలని సూచించారు. గ్రామ స్థా యి నుండి జిల్లా స్థాయి వరకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి, నిర్ణీత కాలపరిమితిలో లక్ష్యాలను సాధించాల్సిన బాధ్యత ఉందని వెల్లడించారు. ప్రతి జిల్లా అధికారి తమకు ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా పథకాలు అమలు చేయాలని ఆదేశించారు. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలు సమర్ధవంతంగా అందేలా కృషి చేయాలని సూచించారు. ఈనెల 6 నుండి జూన్ 12 వరకు వివిధ అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడతాయని తెలిపారు. మార్చి 6 నుండి మార్చి 15 వరకు పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ కార్యాలయాలలో ఫైళ్ల పరిష్కరణ అంశంపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నట్లు తెలిపారు.
కార్యాలయాల పరిశుభ్రత, పెండింగ్ ఫైళ్ల వేగవం తమైన పరిష్కారం, రికార్డుల సక్రమ నిర్వహణ, సమయానుకూల సేవలందించడం లక్ష్యంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాలు, మున్సిపాలిటీలలో తడి-పొడి చెత్త వేరు సేకరణ, పిచ్చి ముక్కల తొలగింపు, బహిరంగ ప్రదేశాల్లో దెత్త నిర్మూలన, ప్రభుత్వ భవనాల శుభ్రత కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని సూచించారు.
99 రోజుల కార్యాచరణ గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో ఐదు దశల్లో అమలు చేయబడు తుందని తెలిపారు. మార్చి 6 న మెదక్ జిల్లా కలెక్టరేట్ లో ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయిలో కార్యాచరణపై మంత్రుల సమీక్ష సమావేశం నిర్వహించబడుతుందని వెల్లడించారు. సం బంధిత శాఖల అధికారులు పూర్తి వివరాలతో సిద్ధంగా హాజరుకావాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఇంచార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పాండు, జడ్పీ సీఈఓ జానకిరెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి శివప్రసాద్, డీఆర్డీఓ జ్యోతి, డీడబ్ల్యూఓ లలితకుమారి, జిల్లా వైద్యాధికారి వసంతరావు, హౌసింగ్ పీడీ చలపతిరావు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు.




