6 May, 2026 | 10:58 AM

రేయిలింగ్ గోడ కూలి ఆటో, బైక్ ధ్వంసం

06-05-2026 10:11 AM

చేగుంట మే 06, విజయక్రాంతి: చేగుంట మండలం కర్నాల్ పల్లిలో గత రాత్రి వీచిన ఈదురు గాలులకు రెయిలింగ్ గోడ కూలి, కింద ఉన్న ఆటో, బైక్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. బాధితుడు కట్ల స్వామి కుమార్,అప్పు చేసి ఆటో కొనుక్కుని జీవనం సాగిస్తుండగా, ఈ ప్రమాదంతో ఉపాధి కోల్పోయాడు.అకాల వర్షాలతో ఇప్పటికే పంట నష్టపోయిన తనకు, ఇప్పుడు ఆటో కూడా పాడవడంతో భారీ నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన వేడుకుంటున్నాడు.