4 March, 2026 | 6:02 AM

జాతీయస్థాయి కరాటేలో రాహుల్ విజ్ఞాన్ విద్యార్థుల ప్రతిభ

03-03-2026 12:00 AM

చర్ల, మార్చి 2 (విజయక్రాంతి): ఆత్మ రక్షణ విద్యతోపాటు చదువులోనూ విద్యార్థులు మంచి ప్రతిభ ప్రావీణ్యత సాధించాలని రాహుల్ విజ్ఞాన్ విద్యాలయం వ్యవస్థాపకురాలు డాక్టర్ ప్రతిభ ఆకాంక్షించారు. జాతీయ స్థాయి కరాటే పోటీల్లో చర్ల మండల కేంద్రంలోని రాహుల్ విజ్ఞాన్ విద్యాలయం విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. సుమన్ చోటాఖన్ కరాటే డో మరియు స్పోరట్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆదివారం భద్రాచలంలో జరిగిన జాతీయ స్థాయి కరాటే పోటీల్లో  ఆరుగురు రాహుల్ విద్యార్థులు సత్తా చాటారు .

ఈ సందర్భంగా వారికి సోమవారం పాఠశాల ఆవరణలో ముఖ్య అతిథిగా విచ్చేసిన పాఠశాల వ్యవస్థాపకురాలు  డాక్టర్ ప్రతిభ  విద్యార్థులకు స్వయంగా బెల్టులను , ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ డాక్టర్ డీఎన్ కుమార్, డాక్టర్ ప్రతిభ,ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టీవీపీసీ శాస్త్రి లు  కరాటే మాస్టర్ ముత్తు 7 వ డాన్ బ్లాక్ బెల్ట్,  మరియు జాతీయ స్థాయిలో రాణించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.

జాతీయ స్థాయి గుర్తింపు పొందిన విద్యార్థుల వివరాలు: ఎన్. లేక్ష్య శ్రీ , 5వ తరగతి  బ్రౌన్ బెల్ట్, కె. రీతన్య, 4వ తరగతి బ్లూ బెల్ట్, కె. షణ్ముఖ 3వ తరగతి బ్లూ బెల్ట్, వై. డమరుతి 5వ తరగతి  బ్లూ బెల్ట్, సహస్ర 5వ తరగతి బ్లూ బెల్ట్, యశస్విని 5వ తరగతి గ్రీన్ బెల్ట్ ఈ సందర్భంగా డాక్టర్ ప్రతిభ  మాట్లాడుతూ.. తమ పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయి ప్రమాణాలతో కరాటేలో రాణించడం గర్వకారణమని పేర్కొన్నారు.  పాఠశాల ప్రిన్సిపాల్ వర్మరాజు, సీనియర్ ఉపాధ్యాయులు ఎంవీవీఎల్ నరసింహ రావు, బోసు బాబు, క్రాంతి కుమార్, శ్రీధర్ బాబు, ఆనంద్ మరియు ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.