14 May, 2026 | 2:23 PM

నిరు పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు

14-05-2026 01:21 PM

జిల్లా కాంగ్రెస్ పార్టీ  ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్

ఘట్ కేసర్, మే 14 (విజయక్రాంతి) : నిరుపేదలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల లను అందిస్తుందని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ అన్నారు.  ఘట్కేసర్ సర్కిల్, ఎదులాబాద్ 7వ డివిజన్ పరిధి ఘనపురం పరిధిలోని ఫకీర్ టేక్య తండాలోని వడ్త్యా జ్యోతి, ననావత్ బుజ్జి నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి ముఖ్యఅతిథిగా హాజరై ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పేదల కలల్ని సాకారం చేస్తున్న ఇందిరమ్మ ఇండ్లు ప్రతి గృహప్రవేశం ఒక చిన్న పండుగలా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం హయాంలో  అభివృద్ధి శకం మొదలైందని, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ప్రభుత్వం ప్రజల నమ్మకానికి నిలువెత్తు నిదర్శనమన్నారు. గ

త ప్రభుత్వం పేదలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూసిందని, కానీ నేటి ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపించి పేదలకు శాశ్వత నివాసాలను కల్పిస్తోందని, ఇంటి నిర్మాణంలో దశలవారీగా నిధులు విడుదల చేస్తూ లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు.  ఈకార్యక్రమంలో ఘనపురం మాజీ సర్పంచ్ లు ననావత్ రూప్ సింగ్ నాయక్, వేముల మమత గౌడ్, బద్దం గోపాల్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్  వేముల సత్తయ్యగౌడ్, ఇందిరమ్మ కమిటి సభ్యులు గుర్జకుంట నర్సింహా, ననావత్ శివాజీ నాయక్, మాజీ వార్డు సభ్యులు బింగి సురేష్ గౌడ్, వడ్త్యా జైహిందర్ నాయక్, వడ్త్యా చాంది, ననావత్ సురేష్ నాయక్, రామావత్ రాణి, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.