అక్రమంగా తరలిస్తున్న ఎనిమిది ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
14-05-2026 01:02 PM
నిజాంసాగర్,(విజయకాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని(Nizamsagar Mandal) మాగి గ్రామానికి చెందిన 8 ఇసుక ట్రాక్టర్లను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు నిజాంసాగర్ ఎస్సై శివకుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం గురువారం ఉదయం ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారనే సమాచారం మేరకు 8 ట్రాక్టర్లను సీజ్ చేసి, 8 మంది వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఉమ్మడి నిజాంసాగర్ మండలంలో ఎవరైనా అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే చర్యలు తప్పవని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.






