ఆసిఫాబాద్ అభివృద్ధే లక్ష్యం
....ఎమ్మెల్యే కోవ లక్ష్మి
ఆసిఫాబాద్,(విజయ క్రాంతి): ఆసిఫాబాద్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు.గురువారం జిల్లా కేంద్రంలోని కొట్నాక భీంరావు చిల్డ్రన్స్ పార్క్‌లో నిర్వహించిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, మున్సిపల్ చైర్మన్ మంగ్రే ఆకాష్, వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్, మున్సిపల్ కమిషనర్ తిరుపతితో కలసి పట్టణం లో సుమారు రూ.1.20 కోట్ల నిధులతో నిర్మించనున్న షాపింగ్ కాంప్లెక్స్, స్మశాన వాటిక, షాదీ ఖానా , చిల్డ్రన్స్ పార్క్ అభివృద్ధి పనులు చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ “ఆసిఫాబాద్ పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడమే ప్రధాన లక్ష్యం అని తెలిపారు. ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులను దశలవారీగా చేపడుతూ పట్టణాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లడం జరుగుతుందని అన్నారు. షాపింగ్ కాంప్లెక్స్ ద్వారా వ్యాపారులకు సౌకర్యాలు కలుగుతాయి. షాదీ ఖానా, స్మశాన వాటిక నిర్మాణాలతో ప్రజలకు అవసరమైన సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. పిల్లల కోసం చిల్డ్రన్స్ పార్క్‌ను ఆకర్షణీయంగా అభివృద్ధి చేస్తాం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వెంకన్న, సలాం, అబ్దుల్లా ,కార్తీక్ , వినోద్, గోవింద్,భారతి, స్వప్న రాణి, తారాబాయి, లక్ష్మి, కమలమ్మ,నాయకులు గంధం శ్రీనివాస్, ఫయాజ్, ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.






