14 May, 2026 | 2:07 PM

ఉపాధి హామీ కూలీల రాస్తారోకో

14-05-2026 01:14 PM

నంగునూరు, విజయక్రాంతి: ఉపాధి హామీ పథకంలో చేసిన పనులకు సంబంధించి మెటీరియల్ పేమెంట్లు నిలిచిపోవడంతో ఆగ్రహించిన కూలీలు(Employment Guarantee Workers ) బుధవారం నంగునూరు మండల వెంకటాపూర్ గ్రామస్థులు  రాస్తారోకో నిర్వహించారు.గత కొద్దికాలంగా సిమెంట్ రోడ్లు,ఇతర అభివృద్ధి పనులు పూర్తి చేసినప్పటికీ,ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదని, అందుకే రోడ్డుపై కి రావాల్సి వచ్చిందని కూలీలు తెలిపారు.