సుల్తానాబాద్ లో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు....
19-06-2026 01:53 PM
సుల్తానాబాద్, జూన్ 19 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ఆగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని నెహ్రూ విగ్రహం ఎదుట కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారు, ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు, ఈ కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, వైస్ చైర్మన్ అంతటి పుష్పలత, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధనాయక్ దామోదర్ రావు, వేగోళం అబ్బయ్య , కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు , అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు,






